కూకట్​పల్లి ప్లాస్టిక్​ పరిశ్రమలో అగ్నిప్రమాదం

కూకట్​పల్లి ప్లాస్టిక్​ పరిశ్రమలో అగ్నిప్రమాదం
  • రూ.10 లక్షల ఆస్తి నష్టం 
  • ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు 

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లి ప్రశాంతినగర్​లోని ప్లాస్టిక్​గ్లాసుల తయారీ పరిశ్రమలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. సెలవు రోజు కావడంతో అక్కడ కార్మికులు, సిబ్బంది ఎవరూ లేరు. దీంతో ప్రాణనష్టం తప్పింది. రాత్రి 9.30 గంటల సమయంలో షార్ట్​సర్క్యూట్​తో మంటలు వ్యాపించగా గుర్తించిన స్థానికులు ఫైర్​సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

రెండు ఫైర్​ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ప్లాస్టిక్​ గ్లాసుల తయారీ పరిశ్రమ కావడంతో మంటలను అదుపు చేయడానికి రెండు గంటలు పట్టింది. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. కూకట్​పల్లి పోలీసులు కేసు ఫైల్​చేశారు.